ఏలూరు, 2026-07-21
సూపర్ ఎల్నీనో ప్రభావంతో ఏలూరు నగరంలో నీటి కొరత ఏర్పడింది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీటి నిల్వలు తగ్గడంతో, రేపటి నుంచి ఒంటి పూట నీటి సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 22 నుంచి నాలుగు రోజుల పాటు ఉదయం పూట మాత్రమే నీటి సరఫరా ఉంటుందని కమిషనర్ భాను ప్రతాప్ తెలిపారు.
సూపర్ ఎల్నీనో ప్రభావం కారణంగా రేపటి నుంచి ఏలూరు నగరంలో నీటి సరఫరాను ఒంటి పూటకే పరిమితం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజలు సహకరించి పరిస్థితిని అర్థం చేసుకోవాలని కమిషనర్ భాను ప్రతాప్ కోరారు.
ప్రస్తుతం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో కేవలం 10 రోజులకు సరిపడా నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఈ నేపథ్యంలో నగరంలో ప్రత్యామ్నాయంగా ఒక్క పూట మాత్రమే నీటి సరఫరా చేయాలని నిర్ణయించినట్లు కమిషనర్ భాను ప్రతాప్ వెల్లడించారు. ఈ నెల 22వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఉదయం పూట మాత్రమే మంచినీటి సరఫరా ఉంటుందని ఆయన తెలిపారు.











