తూర్పుగోదావరి (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 22
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌరసరఫరాల శాఖలోని రాష్ట్రస్థాయి విజిలెన్స్ కమిటీలో 12 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వినియోగదారుల స్వచ్ఛంద సంస్థలకు చెందిన వీరు కమిటీకి సూచనలు, అభిప్రాయాలు అందించనున్నారు.
పౌరసరఫరాల శాఖలోని రాష్ట్రస్థాయి విజిలెన్స్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా 12 మందిని నామినేట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి అధ్యక్షతన అధికారిక, అనధికారిక సభ్యులతో రాష్ట్రస్థాయి విజిలెన్స్ కమిటీని ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసింది. తాజాగా వినియోగదారుల స్వచ్ఛంద సంస్థలకు చెందిన 12 మందిని అనధికారిక సభ్యులుగా (ప్రత్యేక ఆహ్వానితులుగా) నియమించింది.
నూతనంగా నామినేట్ అయిన వారిలో విశాఖపట్నం జిల్లాకు చెందిన మర్రి సత్యనారాయణ, కాకినాడకు చెందిన కొమ్మూరి శ్రీనివాసరావు, జిల్లా నుంచి జి. అనంతరావు, పశ్చిమగోదావరి నుంచి బొబ్బిలి బంగారయ్య, ఎన్టీఆర్ జిల్లా నుంచి తరుణ్ కాకాణి, గుంటూరు జిల్లా నుంచి చదలవాడ హరిబాబు, పల్నాడు జిల్లా నుంచి షేక్ మస్తాన్, బాపట్ల జిల్లా నుంచి డి. ఇమ్మాన్యుయేల్, తిరుపతి జిల్లా నుంచి పి. రాజారెడ్డి, అన్నమయ్య జిల్లా నుంచి ఎం. వెంకటరెడ్డి, వైఎస్సార్ కడప జిల్లా నుంచి సీపీ రమేశ్, శ్రీసత్యసాయి జిల్లా నుంచి గఫార్ ఉన్నారు.
పౌరసరఫరాల శాఖకు సంబంధించిన అంశాలు, వినియోగదారుల సమస్యలు, ప్రజాపంపిణీ వ్యవస్థలోని లోపాలపై విజిలెన్స్ కమిటీకి వీరి సూచనలు, అభిప్రాయాలు ఉపయోగపడతాయి. తాజా నియామకాలతో వివిధ జిల్లాలకు చెందిన వినియోగదారుల స్వచ్ఛంద సంస్థలకు రాష్ట్రస్థాయి కమిటీలో ప్రాతినిధ్యం లభించింది.












