పిచ్చాటూరు (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 07
మండలంలో కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. అర్హులైన లబ్ధిదారులు ఈనెల 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో మహమ్మద్ రఫీ సూచించారు. దరఖాస్తుల పరిశీలన, ఆమోద ప్రక్రియలకు సంబంధించి స్పష్టమైన షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు.
* నేటి నుంచే కొత్త పెన్షన్లకు దరఖాస్తులు* మండలంలో స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు కార్యాలయాల్లో నేటి నుంచి ఈనెల 16 వరకు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో మహమ్మద్ రఫీ అన్నారు. 17 నుంచి 21 వరకు వెరిఫికేషన్ కొనసాగుతుందన్నారు. 22 నుంచి 24 వరకు ఎంపీడీవో లెవెల్లో స్క్రూటినీ, 25, 26 తేదీలలో పెన్షన్లను ఆమోదిస్తారని తెలిపారు. మండలంలో కొత్త పెన్షన్లకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో కోరారు.











