చిలకలూరిపేట జాతీయ రహదారిపై ప్రమాదకరంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించి, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని సామాజికవేత్త, అడ్వకేట్ మాదాసు భాను ప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. ఇటీవల జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
చిలకలూరిపేట జాతీయ రహదారిపై ప్రమాదకరంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించి, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని సామాజికవేత్త, అడ్వకేట్ మాదాసు భాను ప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. ఇటీవల అడ్డరోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందిన నేపథ్యంలో, రహదారి భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ సంఘటనలు రహదారి భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించాయి. డ్రంక్ అండ్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కళ్యాణి సెంటర్, విజయ బ్యాంక్ సెంటర్, నరసరావుపేట సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ వద్ద సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణకు సిగ్నల్స్ అత్యవసరమని తెలిపారు.












