Giddaluru, 26 September
గిద్దలూరు పట్టణంలో ఓ వృద్ధురాలికి మత్తుమందు కలిపిన జ్యూస్ ఇచ్చి, ఆమె చేతుల నుంచి 6 తులాల బంగారు గాజులను దొంగిలించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గిద్దలూరు పట్టణంలోని సాయి విక్రమ్ కాలేజీ రోడ్డులో 75 ఏళ్ల వృద్ధురాలికి మత్తుమందు కలిపిన జ్యూస్ ఇచ్చి బంగారు గాజులు చోరీ చేసిన ఘటన కలకలం రేపింది. ఇంటిపై పోర్షన్లో మూడు నెలలుగా అద్దెకు ఉంటున్న తల్లీకొడుకులు పరిచయం పెంచుకుని, శనివారం వృద్ధురాలిని పైకి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన జ్యూస్ ఇచ్చినట్లు సమాచారం. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమె చేతుల నుంచి రెండు బంగారు గాజులను అపహరించినట్లు బాధితురాలు తెలిపింది. గాజులు సుమారు 6 తులాలు ఉంటాయని, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు పేర్కొంది.












