ఏలూరు, 2026-07-21
ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ ఎన్. శ్రీలక్ష్మి, పలువురు అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ ఎన్. శ్రీలక్ష్మి, సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్, సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ విశ్వనాధం, పానెల్ అడ్వకేట్స్ శ్రీనివాస్, నాగేశ్వరావు, నిర్మల పాల్గొన్నారు.
డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ ఎన్. శ్రీలక్ష్మి మాట్లాడుతూ, ప్రభుత్వ న్యాయ సేవాధికార సంస్థ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్, 1987 ప్రకారం ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తుందని తెలిపారు. పేదలు, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, ఎస్సీ/ఎస్టీ, వృద్ధులు మరియు అర్హులైన ఇతరులకు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
న్యాయ అవగాహన కల్పించడం, ప్రజలకు వారి హక్కులు, చట్టాలు, ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, లోక్ అదాలత్‌లు నిర్వహించడం ద్వారా కోర్టు కేసులు లేదా కోర్టుకు వెళ్లకముందే రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించడం, మధ్యవర్తిత్వం ప్రోత్సహించడం వంటి సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ, ఆస్తి, ఇతర సివిల్ వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించేందుకు సహాయం చేస్తామన్నారు.
బాధితులకు న్యాయ సలహా ఇవ్వడం, అవసరమైతే న్యాయవాదిని ఏర్పాటు చేసి కోర్టులో ప్రాతినిధ్యం కల్పించడం, జైళ్లలో ఉన్న ఖైదీలకు న్యాయ సహాయం అందేలా చర్యలు తీసుకోవడం, బాధితుల హక్కుల పరిరక్షణ కోసం అవసరమైన చట్టపరమైన సహాయం అందించడం వంటివి ఈ సంస్థ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సంస్థ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్, 1987 ప్రకారం పనిచేస్తుందని, ఆర్థిక లేదా సామాజిక కారణాల వల్ల ఎవరూ న్యాయానికి దూరం కాకుండా చూడటమే దీని ముఖ్య ఉద్దేశ్యమని ఆమె అన్నారు.










