Bapatla/Karamchedu (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 11
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంకొల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణి డాక్టర్ టి. అంజలి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో కుటుంబ ప్రణాళిక, జనాభా సమతుల్యత వంటి అంశాలపై స్లోగన్లతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అంజలి కీలక సూచనలు చేశారు.
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఇంకొల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణి డాక్టర్ టి. అంజలి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. 'ఆరోగ్యకరమైన కుటుంబం – సుసంపన్నమైన సమాజం', 'కుటుంబ ప్రణాళిక – ప్రతి దంపతుల హక్కు', 'సమయానికి నిర్ణయం – సుఖమైన జీవనం', 'జనాభా సమతుల్యత – దేశాభివృద్ధికి బాట' వంటి నినాదాలతో ర్యాలీ సాగింది.
ఈ సందర్భంగా డాక్టర్ అంజలి మాట్లాడుతూ, యువత జనాభా తగ్గి, వృద్ధుల జనాభా పెరుగుతోందని, ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదని అన్నారు. ప్రతి దంపతులు తప్పనిసరిగా ఇద్దరు పిల్లలను కనాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ కోటేశ్వరరావు, పీహెచ్ఎన్ సహస్త్ర, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు తదితరులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.












