బాపట్ల, 1జూలై 2026
చీరాల ఎన్.ఆర్. & పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక రోటరీ కమ్యూనిటీ హాలులో జాతీయ 36వ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్యులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బి.సి. రాయ్ జన్మదినం, వర్ధంతి ఒకే రోజున రావడం విశేషమని, ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది జూలై 1న వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఐ. బాబూరావు తెలిపారు.
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా చీరాల ఎన్.ఆర్. & పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక రోటరీ కమ్యూనిటీ హాలులో వైద్యులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఐ. బాబూరావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ వ్యక్తిగత వైద్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, భారతరత్న పురస్కార గ్రహీత, పశ్చిమ బెంగాల్ రెండో ముఖ్యమంత్రిగా సేవలందించిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ (డాక్టర్ బి.సి. రాయ్) జన్మదినం, వర్ధంతి ఒకే రోజున రావడం విశేషమని తెలిపారు. ఆయన సేవలను స్మరించుకుంటూ 1991 నుంచి ప్రతి ఏడాది జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఐ. బాబూరావు, డాక్టర్ ఏ. శంకరరెడ్డి, డాక్టర్ మద్దాల వెంకట రమణారావు, డాక్టర్ డేగల శ్రీనివాస్‌లను వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.
అసోసియేషన్ అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణ మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే, పునర్జన్మ ప్రసాదించేది వైద్యులేనని కొనియాడారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలందించిన వైద్యులను సన్మానించడం గర్వకారణమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ చారగుళ్ల గురుప్రసాద్, గెల్లి తుకారాం, సుభాషిణి, బాల వెంకటేశ్వరరావు, శీరాం రమేష్, చుక్కా శ్రీనివాసరావు, డి.వి. సురేష్, గుద్దంటి రమేష్, జి.వై. ప్రసాద్, ఎం. శ్రీనివాసరావు, వీరాంజనేయులు, నారాయణరావు తదితర వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.











