కారంచేడు, 2026-11-16
కారంచేడు మండల పరిధిలోని స్వర్ణ, కేశవరప్పాడు గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం ఆయన స్వర్ణ, కేశవరప్పాడు గ్రామ పంచాయతీల పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను, స్వర్ణ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు.
కారంచేడు మండల పరిధిలోని స్వర్ణ మరియు కేశవరప్పాడు గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం కారంచేడు మండల పరిధిలోని స్వర్ణ, కేశవరప్పాడు గ్రామ పంచాయతీల పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను, స్వర్ణ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రెండో విడత సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు ఈ నెల 15 నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో చేపట్టాలని సూచించారు. ఈ నెల 26న జరగనున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్, కౌంటింగ్ అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాల్లో అభ్యర్థులకు అవసరమైన తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, నామినేషన్ల స్వీకరణ, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అభ్యర్థులు, వారి ప్రతినిధులు నిబంధనలను పాటించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. నరసింహా రావు, తహశీల్దార్ మాధవిలత, యంపిడిఓ నేతాజీ, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.






