ఏలూరు, July 21
గోదావరి పుష్కరాలు 2027 సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం నుండి ఉన్నతాధికారులు మంగళవారం సమీక్ష నిర్వహించారు. పుష్కరాల స్నాన ఘాట్లు, మౌలిక సదుపాయాలు, రోడ్ల అభివృద్ధి, రవాణా, భద్రత వంటి అంశాలపై అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు.
గోదావరి పుష్కరాలు - 2027 ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం నుండి గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారి వీరపాండియన్, ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శులు ప్రద్యుమ్న, కార్తికేయ మిశ్రా మంగళవారం సాయంత్రం సంబంధిత శాఖల అధికారులు, సంబంధిత జిల్లాల కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పుష్కరాల సందర్భంగా స్నాన ఘాట్ల ఏర్పాట్లు, ఘాట్లలో మౌలిక సదుపాయాలు, ఆయా ప్రాంతాలలో రోడ్ల అభివృద్ధి, రవాణా, భద్రత, తదితర ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల ఉన్నతాధికారులు సమర్పించిన ప్రతిపాదనలపై ఈ సమీక్ష జరిగింది.
ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.











