ఏలూరు, 2026-07-21
దెందులూరు మండలం సోమవరప్పాడు గ్రామంలో రూ. 47 లక్షల వ్యయంతో చేపట్టిన కొత్తచెరువు అభివృద్ధి పనులను దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ మంగళవారం పరిశీలించారు. VBG రాంజీ పథకం కింద చేపట్టిన ఈ పనుల్లో చెరువు గట్టు పటిష్టపరచడం, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లల పార్కు, సోలార్ లైట్ల ఏర్పాటు వంటివి ఉన్నాయి.
దెందులూరు మండలం సోమవరప్పాడు గ్రామంలో 47 లక్షల రూపాయలతో చేపట్టిన చెరువు అభివృద్ధి పనులను దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు, క్వాలిటీ కంట్రోల్ అధికారులు సురేష్, మణికంఠ లతో కలిసి మంగళవారం పరిశీలించారు.
గ్రామంలోని కొత్తచెరువును VBG రాంజీ పథకం లో భాగంగా, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 2.0 (PMKSY 2.0) కార్యక్రమంలో వాటర్‌షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ కింద అభివృద్ధి చేస్తున్నారు.
ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా చెరువు గట్టును పటిష్టపరచడం, వాకింగ్ ట్రాక్, పిల్లల పార్కు, ఓపెన్ జిమ్, సోలార్ లైట్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టారు.
పనులను క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు సంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత సమయంలోపు పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో APO ఫాతిమా, సాంకేతిక సహాయకులు సారథి, దీప్తి, సహకార సంఘం అధ్యక్షులు వి.ఆర్.కె. నాని, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.











