Bapatla/Karamchedu (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 22
పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇంకొల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 80 మంది గర్భిణీ స్త్రీలకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి ప్రియ, మండల ఎంఆర్ఓ ఏవీఎస్ శ్రీనివాస్ ఈ కిట్లను అందజేశారు. ఈ కిట్ల వల్ల గర్భిణుల ఆరోగ్యంతో పాటు శిశువుల ఎదుగుదలకు మేలు జరుగుతుందని అధికారులు తెలిపారు.
ఇంకొల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం కింద 80 మంది గర్భిణీ స్త్రీలకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి ప్రియ, ఇంకొల్లు మండల ఎంఆర్ఓ ఏవీఎస్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ కిట్లను అందజేశారు.
ఈ పోషకాహార కిట్లను తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలకు రక్తహీనత రాకుండా ఉంటుందని, డెలివరీ సమయంలో అవసరమైన రక్తం ముందుగానే తయారవుతుందని, తద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వవచ్చని డాక్టర్ సాయి ప్రియ తెలిపారు. ఈ కిట్లలో 12 రకాల పోషకాహారాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
అటుకులు, మరమరాలు, బెల్లం, వేరుశనగపప్పు, ఉప్పు, సెనగలు, ఖర్జూరాలు, పాలపొడి, బిస్కెట్ ప్యాకెట్, వేరుశనగ చిక్కీ, అవిసె గింజలు, మీల్ మేకర్ ప్యాకెట్, గోధుమ రవ్వ ప్యాకెట్ వంటి పోషకాహారాలు ఈ ప్యాకెట్లలో ఉన్నాయని తెలిపారు. వీటిని గర్భిణీ స్త్రీలు తమ ఆహారంలో సక్రమంగా కలుపుకొని ఉపయోగించుకుంటే మంచి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇంకొల్లు మండల ఎమ్మార్వో ఏవీఎస్ శ్రీనివాస్ రావు, సిహెచ్ఓ కోటేశ్వరరావు, పి.హెచ్.ఎన్ సహస్ర, సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్ జయరామిరెడ్డి, ఏఎన్ఎమ్స్, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.












