** (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 20
ముదినేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మరణించిన వ్యక్తి ఆస్తులను అక్రమంగా కాజేయాలని చూసిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ములకలపల్లి గ్రామానికి చెందిన త్రపునేని ఏనుబాబు ఆస్తులను కాజేయాలనే దుర్ద్దేశంతో నకిలీ పత్రాలను సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ముదినేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మరణించిన వ్యక్తి ఆస్తులను అక్రమంగా కాజేయాలని చూసిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ముదినేపల్లి మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన త్రపునేని ఏనుబాబు మరణానంతరం, ఆయన ఆస్తులను అక్రమంగా కాజేయాలనే దుర్ద్దేశంతో గోపిశెట్టి మహంకాళి, కాగిటాల కొండమ్మ, నల్లపు శివలు పరస్పర కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
నకిలీ మరణ ధృవీకరణ పత్రం, నకిలీ కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం, ఫోర్జరీ చేసిన ఆధార్ కార్డులు మరియు ఇతర నకిలీ పత్రాలను ఆధారంగా చేసుకుని మోసానికి పాల్పడ్డారు. ఈ నకిలీ పత్రాల ద్వారా RS No.14/2 లో ఉన్న 1.00 ఎకరం చేపల చెరువు, RS No.12/3 లో ఉన్న 1.23 ఎకరాల చేపల చెరువు, Door No.1-50 గల 3 సెంట్ల స్థలంలో ఉన్న డాబా ఇల్లు వీటికి సంబంధించి 21-02-2026 వ తేదీన కైకలూరు సబ్-రిజిస్టర్ కార్యాలయంలో అక్రమంగా పార్టిషన్ డీడ్, సేల్ డీడ్ మరియు గిఫ్ట్ డీడ్లను రిజిస్ట్రేషన్ చేయించినట్లు దర్యాప్తులో తేలింది.
నిందితులలో కాగిటాల కొండమ్మ మరియు నల్లపు శివలు లను 20-07-2026 న ములకలపల్లి గ్రామంలో అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి నేరానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం వారిని గౌరవన్యాయస్థానం ముందు హాజరుపరచడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ కేసును ఛేదించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను మరియు సిబ్బందిని ఏలూరు జిల్లా ఎస్పీ గారు అభినందించారు. అభినందనలు అందుకున్న వారిలో శ్రీ వి.రవి కుమార్, కైకలూరు రూరల్ సి.ఐ.; శ్రీ వి.ఎస్.వి.భద్రరావు, ఎస్.ఐ. ముదినేపల్లి; HC-1789 పి.వి.సత్యనారాయణ; PC-4203 బి.నాగబాబు; PC-4206 పి.పవన్ కుమార్; HG-438 జి.శివ కోటయ్య ఉన్నారు.












