విప్రో జీఈ హెల్త్‌కేర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా, జీఈ హెల్త్‌కేర్ దక్షిణాసియా విభాగం ప్రెసిడెంట్, సీఈఓగా వీఎస్ రాఘవేంద్రరావు నియమితులయ్యారు. జనవరి 4 నుంచి ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ పదవుల్లో ఉన్న చైతన్య శరవాతే స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 16 ఏళ్లుగా సంస్థలో పనిచేస్తున్న చైతన్య శరవాతే, ఇతర అవకాశాల కోసం సంస్థను వీడుతున్నారు.
రాఘవేంద్రరావుకు విప్రో జీఈ హెల్త్‌కేర్‌లో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. 2002లో సంస్థలో చేరిన ఆయన, వివిధ వాణిజ్య, కార్యకలాపాల విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కొత్త బాధ్యతల్లో భాగంగా, భారత్‌తో పాటు దక్షిణాసియాలో సంస్థ వ్యాపార విస్తరణ, స్థానిక తయారీ, సాంకేతిక ఆవిష్కరణలు, నాణ్యమైన వైద్య సేవలను మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించనున్నారు.






