** (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 21
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్ఆర్) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ అధినేత వై.యస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా కేంద్రంలో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయం నుండి ధర్నా చౌక్ వరకు వైయస్ఆర్సీపీ నేతలు, మహిళా నాయకులు, కార్యకర్తలు భారీ ప్రదర్శన చేపట్టారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్ఆర్) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ అధినేత వై.యస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా కేంద్రంలో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయం నుండి ధర్నా చౌక్ వరకు వైయస్ఆర్సీపీ నేతలు, మహిళా నాయకులు, కార్యకర్తలు భారీ ప్రదర్శన చేపట్టారు.
ఇటీవల గుంటూరులో కూటమి నేత ఒకరు మహిళపై అనైతికంగా దాడి చేసిన ఘటన రాష్ట్ర ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా హోంమంత్రి పదవిలో ఒక మహిళ ఉన్నప్పటికీ, రాష్ట్రంలో మహిళలపై ఇటువంటి దాడులు పెద్ద సంఖ్యలో జరుగుతుండటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. కూటమి పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.
ఈ నిరసన కార్యక్రమంలో జిల్లాలోని మొత్తం ఏడు నియోజకవర్గాల నుండి పెద్ద సంఖ్యలో వైయస్ఆర్సీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. వీరితో పాటు ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ మామిళ్ళపల్లి జయప్రకాష్ (జేపీ), దెందులూరు నియోజకవర్గ ఇంచార్జ్ కొఠారు అబ్బాయి చౌదరి, చింతలపూడి నియోజకవర్గ ఇంచార్జ్ కంభం విజయరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసరి సరిత రెడ్డి తదితరులు పాల్గొని ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.












