ఏలూరు, జూలై 17
ఏలూరు రూరల్ పరిధిలోని దెందులూరు సమీపంలో గోదావరి కాలువలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మున్సిపల్ సిబ్బంది కాలువలో గుర్రపు డెక్కలను తొలగిస్తుండగా ఈ మృతదేహాన్ని గుర్తించారు.
ఏలూరు రూరల్ పరిధిలోని దెందులూరు సమీపంలో ఉన్న గోదావరి కాలువలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వెలుగుచూసింది.
మున్సిపల్ వర్క్ ఇన్స్పెక్టర్ నీరుకొండ వీర వెంకట దుర్గా ప్రసాద్ పర్యవేక్షణలో కాలువలో గుర్రపు డెక్కలను తొలగిస్తుండగా, నీటిలో కొట్టుకు వచ్చిన మృతదేహాన్ని సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారం అందించారు.
మృతుడి వయసు సుమారు 50 నుండి 60 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి, చర్మం ఊడిపోయిన స్థితిలో ఉండటం గమనార్హం. మృతుడు పింక్ రంగు ఫుల్ హ్యాండ్ షర్టు ధరించి ఉన్నాడు.
సమాచారం అందుకున్న ఏలూరు రూరల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఏలూరు రూరల్ ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
మృతుడి ఆచూకీ తెలిసిన వారు లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే, దయచేసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరడమైనది.
సంప్రదించవలసిన నంబర్లు: 94407 96636 (ఏలూరు రూరల్ ఎస్సై), 94407 96604 (ఇన్స్పెక్టర్).












