బాపట్ల, 2026-07-23
55 రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన మైనర్ బాలికను శుక్రవారం హైకోర్టులో హాజరు పరుస్తామని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు న్యాయమూర్తులకు తెలిపారు. గురువారం హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ మేరకు న్యాయస్థానానికి వివరించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదులో జాప్యంపై న్యాయస్థానం దృష్టి సారించింది.
55 రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన మైనర్ బాలికను శుక్రవారం హైకోర్టులో హాజరు పరుస్తామని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు న్యాయమూర్తులకు తెలిపారు. గురువారం హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ మేరకు న్యాయస్థానానికి వివరించారు.
రోదియా తన కుమార్తె కిడ్నాప్ కు గురైందని, కీర్తిపాటి వెంకట్రావు నమ్మించి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లాడని జూన్ మూడవ తేదీన ఉలవపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఉలవపాడు ఎస్సై సుబ్బారావు, ఇంటర్ చదివిన రోదియా కుమార్తెను కిడ్నాప్ చేసిన కీర్తిపాటి వెంకట్రావుపై ఫోక్సో మరియు కిడ్నాప్ కేసు నమోదు చేయకుండా, మొక్కుబడిగా బాలిక మిస్సింగ్ క్రైమ్ నెంబర్ 60/26 గా కేసు నమోదు చేశారని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు.
తమ మైనర్ కుమార్తె ఆచూకీ చెప్పాలని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాలిక తల్లిదండ్రులను, బంధువులను ఉలవపాడు ఎస్సై సుబ్బారావు అవమానించి, బాధించారని, బాలిక ఆచూకీ కోసం వెతకకుండా కిడ్నాపర్ కు మద్దతుగా మాట్లాడుతూ బాలిక తల్లిదండ్రులను మనోవేదనకు గురి చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
బాలిక కిడ్నాప్ వ్యవహారంలో ఉలవపాడు ఎస్సై సుబ్బారావు అవహేళనతో విసిగిపోయిన బాలిక బంధువులు కందుకూరు సిఐ, కందుకూరు డిఎస్పి లను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. వారు కూడా ఉలవపాడు ఎస్సై సుబ్బారావు వైఖరికే వంత పాడారని తెలిపారు. తరువాత జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసి ఫిర్యాదు చేసినా సరిగా స్పందించలేదని బాధిత తల్లిదండ్రులు, దళిత నాయకులు నీలం నాగేంద్రరావును కలిశారు.
సోమవారం కలెక్టరేట్లో జరిగిన ఎస్సీ ఎస్టీ స్పెషల్ గ్రీవెన్స్ సెల్ లో జిల్లా కలెక్టర్ రాజాబాబుకు ఫిర్యాదు చేయగా, కందుకూరు డిఎస్పీ బాలసుబ్రమణ్యం తో ఫోన్లో మాట్లాడి బాలిక ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించాలని, కిడ్నాపర్ ను అరెస్టు చేయాలని, ఫోక్సో మరియు కిడ్నాప్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అయితే, బేతాళుడి కథలాగే కందుకూరు డిఎస్పి కూడా కలెక్టర్ కు, 'ఖియాకి కధ' బాలిక బంధువులతో కలిసి ఉలవపాడు ఎస్సై పోలీస్ టీములు పనిచేస్తున్నాయని తెలిపారు.
అంతట, పోలీస్ అధికారులు మొత్తం మాదిగ బాలిక కిడ్నాపర్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ పోక్సో కేసు మరియు కిడ్నాప్ కేసు నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్నారని గ్రహించిన దళిత నాయకులు నీలం నాగేందర్రావు, వెంటనే జగన్ ను కోడి కత్తితో పొడిచిన కోడి కత్తి శ్రీను కేసును హైకోర్టులో వాదించిన ప్రముఖ న్యాయవాది సలీం తో ఫోన్లో మాట్లాడి, బాధిత బాలిక తల్లి రోదియా సంతకాన్ని, కేసుకు అవసరమైన ఎఫ్ఐఆర్, క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ పంపించి, హైకోర్టులో ఈ నెల 21వ తేదీన హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయించారని తెలిపారు.












