నరసరావుపేట పట్టణం, Narasaraopeta, Palnadu, Andhra Pradesh (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 14
నరసరావుపేటేడులు భక్తిలో, పర్యావరణ స్పృహలతో ప్రారంభము. పట్టణంలో ఏర్పడుతున్న సమండం, దేవాలయాలు ఆధ్యాత్మిక శోభతో అలరిస్తున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనం చేస్తున్నారు.
నరసరావుపేట పట్టణంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలు, పర్యావరణ స్పృహ నడుమ వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ప్రకాష్ నగర్, బరంపేట, పెద్దచెరువు, కోటప్పకొండ రోడ్డుతో పాటు వివిధ వార్డుల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలు, దేవస్థానాలు ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రథమ పూజ్యుడిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు పలు పందిళ్లను సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటప్పకొండ రోడ్డులోని గణేష్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ వినాయక స్వామివారికి ఎమ్మెల్యే తన చేతుల మీదుగా 500 గ్రాముల వెండితో తయారు చేసిన కిరీటం, నామాలు, కళ్ళు, తొండం తదితర వస్తువులను సమర్పించారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనించాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.












