వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన హెచ్ఆర్సిఐ జాతీయ అధ్యక్షులు విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (హెచ్ ఆర్ సి ఐ) వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హెచ్ఆర్సిఐ కుటుంబ సభ్యులు, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి హోదాదారులు, కార్యకర్తలతో పాటు దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి మాట్లాడుతూ విఘ్నేశ్వరుని కృపతో ప్రజల జీవితాల్లోని అన్ని అడ్డంకులు తొలగిపోయి, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, విజయవంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో పాటు సమైక్యత, సోదరభావం, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ, శాంతి, సామరస్యం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని కోరారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో దేశ ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి చేకూరాలని డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి ఆకాంక్షించారు.
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన హెచ్ఆర్సిఐ జాతీయ అధ్యక్షులు
Share:

సారాంశం
వినాయక చవితి
ముఖ్య విషయాలు
- వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో పాటు సమైక్యత, సోదరభావం, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
- సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ, శాంతి, సామరస్యం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని కోరారు.
- వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన హెచ్ఆర్సిఐ జాతీయ అధ్యక్షులు విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (హెచ్ ఆర్ సి ఐ) వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హెచ్ఆర్సిఐ కుటుంబ సభ్యులు, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి హోదాదారులు, కార్యకర్తలతో పాటు దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
- ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి మాట్లాడుతూ విఘ్నేశ్వరుని కృపతో ప్రజల జీవితాల్లోని అన్ని అడ్డంకులు తొలగిపోయి, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, విజయవంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

MR. DAGGUBATI RAMBABU
Reporter
Andhra Pradesh
196ఆర్టికల్స్
35,470వ్యూస్









