తిరుపతి, 13 September
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ టీడీపీ పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కందేరి కార్తీక్ చౌదరి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ టీడీపీ పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కందేరి కార్తీక్ చౌదరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో వినాయక చవితి వేడుకలను నిర్వహించుకోవాలని కోరారు.
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ సంయమనం పాటిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు, అపశ్రుతులకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఉత్సవాల నిర్వహణలో నిర్వాహకులు, యువత ప్రత్యేక బాధ్యతతో వ్యవహరించాలని, భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పండుగ సందర్భంగా ప్రజల మధ్య సోదరభావం, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని ఆశీస్సులు జిల్లా ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సిరిసంపదలు నిండాలని కందేరి కార్తీక్ చౌదరి ఆకాంక్షించారు.











