బాపట్ల, 2026-08-02
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చీరాల సబ్ డిస్ట్రిక్ట్ కార్యాలయం, రమేష్ హాస్పిటల్స్ సహకారంతో ఆగస్టు 2వ తేదీన ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ శిబిరంలో ప్రజలు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చీరాల సబ్ డిస్ట్రిక్ట్ కార్యాలయంలో ఆగస్టు 2వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు రమేష్ హాస్పిటల్స్ సహకారంతో ఈ శిబిరం జరుగుతుందని రెడ్ క్రాస్ ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో చీరాల తహశీల్దార్ గోపికృష్ణ ఉచిత వైద్య శిబిరం ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ వైద్య శిబిరంలో ప్రజలు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకుని నిపుణుల సలహాలు పొందవచ్చని ఆయన తెలిపారు. పాత్రికేయ మిత్రులందరూ ఈ శిబిరానికి విచ్చేసి, కార్యక్రమాన్ని కవర్ చేయడంతో పాటు వైద్య సేవలను కూడా వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ బూదరాజు శశికిరణ్, కార్యదర్శి గంగవరపు ప్రసాద్, మేనేజింగ్ కమిటీ సభ్యుడు తడవర్తి చంద్ర, జిల్లా కోఆర్డినేటర్ పిన్ని బోయిన శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.










