హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (హెచ్ఆర్సీఐ) సంస్థ చొరవతో, అన్యాయానికి గురైన ఒక మహిళ సమస్యకు సత్వర పరిష్కారం లభించింది. పంజాగుట్ట ఏసీపీ మురళీకృష్ణ సహాయంతో కేసు నమోదు (ఎఫ్ఐఆర్) ప్రక్రియ పూర్తయింది.
తమకు అన్యాయం జరిగిందని హెచ్ఆర్సీఐ సంస్థను ఆశ్రయించిన మహిళ తరపున, సంస్థ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి అమృతం వీర, పంజాగుట్ట ఏసీపీ మురళీకృష్ణను కలిసి సమస్యను వివరించారు. ఏసీపీ వెంటనే స్పందించి, మహిళతో మాట్లాడి, కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేశారు.
బాధితురాలు మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్లలో తన ఫిర్యాదులను పట్టించుకోలేదని, హెచ్ఆర్సీఐ సంస్థను ఆశ్రయించిన తర్వాతే న్యాయం జరిగిందని తెలిపారు. సంస్థ ప్రతినిధులు, న్యాయవాదుల సహకారంతో రెండు రోజుల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు కావడం పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఆర్సీఐ సంస్థకు చెందిన పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. వీరంతా కలిసి ఏసీపీ మురళీకృష్ణను సత్కరించారు.


