పామూరు, 13 September
ప్రయాణికుడు పోగొట్టుకున్న చరవాణిని గుర్తించి, అతడికి తిరిగి అందజేసిన ఆర్టీసీ భద్రతా సిబ్బంది నిజాయితీని చాటుకున్నారు. కనిగిరి డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది.
నిజాయితీకి నిదర్శనం.. వృద్ధుడి చరవాణి అప్పగింత క్రౌన్ హ్యూమన్ రైట్స్ కనిగిరి ప్రయాణికుడు పోగొట్టుకున్న చరవాణిని గుర్తించి, అతడికి తిరిగి అందజేసిన ఆర్టీసీ భద్రతా సిబ్బంది నిజాయితీని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కనిగిరి డిపోకు చెందిన ఏపీ 27 జెడ్ 0214 పల్లెవెలుగు బస్సు బోడవాడ సర్వీసు ముగించుకుని కనిగిరి ఆర్టీసీ డిపో ప్రధాన గేటు వద్దకు చేరుకుంది. బస్సును తనిఖీ చేస్తున్న ఆర్టీసీ భద్రతా హెడ్ కానిస్టేబుల్ శెట్టిపల్లి కొండయ్యకు సీట్ల మధ్యలో ఒక చరవాణి కనిపించింది.చరవాణిని భద్రంగా భద్రపరిచి, అందులోని కాల్ కోసం ఎదురుచూశారు. కొద్దిసేపటికి చరవాణికి కాల్ రావడంతో స్పందించగా, పామూరుకు చెందిన వృద్ధుడు పెద్ద వెంకయ్య తన చరవాణి పోయిందని తెలిపారు. చరవాణి తనదేనని నిర్ధారించేందుకు వివరాలు తెలుసుకున్న అనంతరం ఆయనను కనిగిరి ఆర్టీసీ డిపోకు రావాలని సూచించారు.వృద్ధుడు కావడంతో ఆయన ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో హెడ్ కానిస్టేబుల్ శెట్టిపల్లి కొండయ్య స్వయంగా కనిగిరి నుంచి పామూరు బస్టాండ్‌కు వెళ్లి పెద్ద వెంకయ్యకు చరవాణిని అందజేశారు. చరవాణి తిరిగి చేతికి అందడంతో వృద్ధుడు సంతోషం వ్యక్తం చేసి ఆర్టీసీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రయాణికుడి వస్తువును భద్రంగా ఉంచి, వృద్ధుడి వద్దకు స్వయంగా వెళ్లి అప్పగించిన హెడ్ కానిస్టేబుల్ శెట్టిపల్లి కొండయ్యను పలువురు అభినందించారు.












