ఒంగోలు, 13 September
మహాకవి గుర్రం జాషువా 131వ జయంతిని పురస్కరించుకుని, ఈ నెల 26న ఒంగోలులో దళిత సాంస్కృతిక, రచన అవార్డుల ప్రధాన సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను దళిత నేత నీలం నాగేంద్రరావు ఆవిష్కరించారు. తెలుగు దళిత ప్రజా సంఘం కన్వీనర్ వెల్లుట్ల వరుణ్ తేజ సభ వివరాలను వెల్లడించారు.
ఈ నెల 26న ఒంగోలులో దళిత సాంస్కృతిక అవార్డుల ప్రధాన సభ మహాకవి గుర్రం జాషువా 131వ జయంతి సందర్భంగా నిర్వహణ పోస్టర్ను ఆవిష్కరించిన దళిత నేత నీలం నాగేంద్రరావు మహాకవి గుర్రం జాషువా 131వ జయంతి సందర్భంగా ఈ నెల 26న ఒంగోలులో నిర్వహించనున్న దళిత సాంస్కృతిక, రచన అవార్డుల ప్రధాన సభకు సంబంధించిన పోస్టర్ను దళిత నేత నీలం నాగేంద్రరావు ఆవిష్కరించారు. స్థానిక సమితి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలుగు దళిత ప్రజా సంఘం కన్వీనర్ వెల్లుట్ల వరుణ్ తేజ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ మాట్లాడుతూ, గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకుని ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో రాష్ట్రవ్యాప్తంగా దళిత సాంస్కృతిక ఉద్యమకారులు, రచయితలు, కవులు, కళాకారులను సత్కరించడంతో పాటు అవార్డులు అందించనున్నట్లు తెలిపారు. గత సంవత్సరం ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా సాహిత్య, ఉద్యమ రంగాల్లో విశేష సేవలు అందించిన దళిత మేధావులకు సన్మానంతో పాటు నగదు పురస్కారాలను అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంద కృష్ణ మాదిగ, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్, హైదరాబాద్ ఉర్దూ యూనివర్సిటీ ప్రొఫెసర్, రచయిత జి.వి. రత్నాకర్, దళిత నేత నీలం నాగేంద్రరావు తదితరులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. గుర్రం జాషువా సాహిత్య స్ఫూర్తిని కొనసాగిస్తూ దళిత సాహిత్యం, సంస్కృతి, కళలు, సామాజిక ఉద్యమాలకు సేవలందిస్తున్న వారిని ప్రోత్సహించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వరుణ్ తేజ తెలిపారు. ఈ అవార్డుల ప్రధాన సభకు అంబేద్కర్వాదులు, దళిత రచయితలు, కవులు, కళాకారులు, సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలుగు దళిత ప్రజా సంఘం కన్వీనర్ వెల్లుట్ల వరుణ్ తేజ విజ్ఞప్తి చేశారు.











