బాపట్ల, 2026-07-26
దగుచెంద55ోజుుగఆచూీభంచోయ,ుగొుగుుతుఉవుఎసససువుుతషణేససెంచేయదళతహుషణసతఅధయషుుీంగేందవు,ధతుతదంుతోసంచేశు.తదంుుోీససటేషువచచఎససవవంచటుసచం.
మాదిగ కులానికి చెందిన మైనర్ బాలిక 55 రోజులుగా ఆచూకీ లభించకపోయినా, కిడ్నాపర్ కు గొడుగు పడుతున్న ఉలవపాడు ఎస్సై సుబ్బారావును తక్షణమే సస్పెండ్ చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు, బాధితుల తల్లిదండ్రులతో కలిసి డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం కిడ్నాప్ కు గురైన బాలిక తల్లిదండ్రులతో కలిసి ఉలవపాడు పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పటికీ, స్టేషన్ లో ఉన్న ఎస్సై సుబ్బారావు వారిని కలవడానికి నిరాకరించారు.
ఈ నేపథ్యంలో, దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేందర్రావు కందుకూరు సిఐ అన్వర్ బాషాకు ఫోన్ చేసి, మైనర్ బాలిక కిడ్నాప్ విషయంపై ఉలవపాడు ఎస్సై కాలయాపన చేస్తున్న వైఖరిని వివరించారు. కిడ్నాప్ కు గురైన బాలిక ఏలూరు పరిసర ప్రాంతాలలో ఉందని, ఫోన్ వాడటం లేదని, ఎస్సై ఆ పని మీదే ఉన్నారని సిఐ తెలిపారు.
అయితే, ఆగస్టు 6వ తేదీతో కిడ్నాప్ కు గురైన బాలిక మేజర్ అవుతుందని, ఉలవపాడు ఎస్సై కిడ్నాపర్ ను పట్టుకునే ఉద్దేశం లేకుండా కాలయాపన చేస్తూ రక్షిస్తున్నారని నీలం నాగేంద్రరావు ఆరోపించారు. మైనర్ బాలిక స్వచ్ఛందంగా మేజర్ తో వెళ్లినా, తల్లి ఫిర్యాదు చేస్తే కిడ్నాప్ కేసు నమోదు చేయాలని, కానీ మిస్సింగ్ కేసుగా ఎలా నమోదు చేస్తారని కందుకూరు సిఐని ప్రశ్నించారు. 50 రోజుల తర్వాత హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాతే కిడ్నాప్ కేసుగా మార్చారని, మైనర్ బాలికను తల్లిదండ్రులకు అప్పగించే ఉద్దేశం ఎస్సై సుబ్బారావుకు లేదని, కిడ్నాప్ ఆచూకీ ఆయనకు తెలుసని అన్నారు.
ఈ నేపథ్యంలో, ఉలవపాడు పోలీస్ స్టేషన్ ముందు బాలిక తల్లిదండ్రులు, రోదియాతో పాటు పలువురు నిరసన తెలిపారు. 55 రోజులు గడిచినా మైనర్ బాలిక ఆచూకీ కనుగొనని ఉలవపాడు ఎస్సై సుబ్బారావును సస్పెండ్ చేయాలని వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ, ఉలవపాడు ఎస్సై సుబ్బారావు ఆధ్వర్యంలోనే ప్రత్యేక పోలీసు బృందాలు మాదిగ కులానికి చెందిన మర్లపాటి రోదియా అనే మైనర్ బాలిక ఆచూకీని 55 రోజులు అయినా కనుగొనలేకపోయాయని తెలిపారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన బంధువులను అవమానించి, వేధించారని ఆరోపించారు. కందుకూరు సిఐ, డిఎస్పిలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు.
ఇటీవల ఉలవపాడు పోలీస్ స్టేషన్ కు ఇండోసోల్ కంపెనీ వారు ఇచ్చిన డ్రోన్ లను పేకాట ఆడేవారిని, మద్యం తాగేవారిని పట్టుకోవడానికి మాత్రమే పరిమితం చేయకుండా, పాలకీర్తి వెంకట్రావు లాంటి కిడ్నాపర్ ను అరెస్టు చేయడానికి కూడా ఉపయోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాలిక తల్లిదండ్రులతోపాటు మాల మహానాడు అధ్యక్ష కార్యదర్శులు దారా అంజయ్య, కాకుమాను రవి, మేడికొండ మురళి తదితరులు పాల్గొన్నారు.










