ఏలూరు, జూలై 21
కలిదిండి మండలంలో బీజేపీ సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మండల అధ్యక్షుడు అంకెల దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చిట్టూరి రవీంద్ర, కైకలూరు బీజేపీ-1 అసెంబ్లీ కన్వీనర్ కోటప్రోలు కృష్ణారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కలిదిండి మండలంలో బీజేపీ మండల అధ్యక్షుడు అంకెల దుర్గాప్రసాద్ అధ్యక్షతన, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చిట్టూరి రవీంద్ర గారి ఆధ్వర్యంలో, కైకలూరు బీజేపీ-1 అసెంబ్లీ కన్వీనర్ కోటప్రోలు కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంపై మండల సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా 63 మంది బూత్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించి, ఎన్నికల సంఘం చేపడుతున్న సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఫారం-6 ద్వారా అర్హులైన కొత్త ఓటర్ల పేర్లను నమోదు చేయించడం, ఫారం-7 ద్వారా అనర్హులైన లేదా అర్హత కోల్పోయిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించే ప్రక్రియపై బూత్ ఏజెంట్లకు వివరించారు.
ప్రతి అర్హుడైన ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హులైన వారి పేర్లు తొలగించబడేలా క్షేత్రస్థాయిలో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి నాయకత్వంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించేలా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కోక శ్రీనివాస్, కేశిరెడ్డి వేణు, రాధాకుమారితో పాటు పార్టీ నాయకులు, బూత్ ఏజెంట్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.












