డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతిష్ఠ దెబ్బతీసేలా ఉన్న కల్పిత నాయకుడు పుస్తకాన్ని రాసిన హమారా ప్రసాద్ అలియాస్ ఎన్. ప్రసాద్‌ను అరెస్ట్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు తెలిపింది. రిమాండ్‌కు తరలించామని, పుస్తక ప్రతులను స్వాధీనం చేసుకున్నామని, ఆన్లైన్ అమ్మకాలను అడ్డుకుంటున్నామని ప్రభుత్వం వివరించింది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతిష్ఠ దెబ్బతీసేలా ఉన్న కల్పిత నాయకుడు (ది ఫ్యాబ్రికేటెడ్ లీడర్) పుస్తకాన్ని రాసిన హమారా ప్రసాద్ అలియాస్ ఎన్. ప్రసాద్‌ను అరెస్ట్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు తెలిపింది. రిమాండ్‌కు తరలించామని పేర్కొంది. ఆ పుస్తక ప్రతులను స్వాధీనం చేసుకున్నామని, ఆన్‌లైన్‌లోనూ వాటి అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది.
శుక్రవారం తలపెట్టిన ఆ పుస్తక ఆవిష్కరణను అడ్డుకోవాలని, రచయిత ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నాగోల్ కు చెందిన జర్నలిస్టు జ్ఞానచంద్రన్ మౌళి, మరికొంతమంది హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. లంచ్ మోషన్ రూపంలో అత్యవసర విచారణ కోసం దాఖలైన ఆ పిటిషన్లపై జస్టిస్ టీ. మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదిస్తూ, పుస్తకావిష్కరణను అడ్డుకోకపోతే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది మహేశ్ రాజే వాదిస్తూ, రచయిత ప్రసాద్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని, మేజిస్ట్రేట్ కోర్టు అనుమతి మేరకు రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు.
పోలీసుల చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం ఆ పిటిషన్లపై విచారణను ముగిస్తున్నట్లు తెలిపింది.







