ఎడ్లపాడు, 15 September
పల్నాడు జిల్లా మండలం చెంఘిజ్‌ఖాన్‌పేటకు చెందిన పోలిపోగు సుమ మాధురి ఈ నెల 14వ తేదీన షాపింగ్ నిమిత్తం గుంటూరులోని డీ-మార్ట్‌కు వచ్చారు. షాపింగ్ అనంతరం డీ-మార్ట్ నుంచి పల్నాడు బస్టాండ్‌కు ఆటోలో వెళ్లారు. ఆటోకు డబ్బులు చెల్లించిన అనంతరం రూ.35,000 నగదు ఉన్న బ్యాగ్‌ను ఆటోలోనే మర్చిపోయినట్లు గుర్తించారు.
పోగొట్టుకున్న రూ.35,000 నగదుతో కూడిన బ్యాగ్‌ను సీసీటీవీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గుర్తించి బాధితురాలికి అప్పగించారు లాలాపేట పోలీసులు. పల్నాడు జిల్లా మండలం చెంఘిజ్‌ఖాన్‌పేటకు చెందిన పోలిపోగు సుమ మాధురి ఈ నెల 14వ తేదీన షాపింగ్ నిమిత్తం గుంటూరులోని డీ-మార్ట్‌కు వచ్చారు. షాపింగ్ అనంతరం డీ-మార్ట్ నుంచి పల్నాడు బస్టాండ్‌కు ఆటోలో వెళ్లారు. ఆటోకు డబ్బులు చెల్లించిన అనంతరం రూ.35,000 నగదు ఉన్న బ్యాగ్‌ను ఆటోలోనే మర్చిపోయినట్లు గుర్తించారు.
వెంటనే లాలాపేట పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీనిపై లాలాపేట సీఐ ఏ.వి. శివప్రసాద్ ఆదేశాల మేరకు ఎస్ఐ సి.హెచ్. ప్రవీణ్ ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లు కిరణ్, శంకర్ రంగంలోకి దిగారు.
సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, బ్యాగ్ మర్చిపోయిన ఆటోను గుర్తించారు. అనంతరం ఆటోను స్వాధీనం చేసుకుని, రూ.35,000 నగదుతో కూడిన బ్యాగ్‌ను సురక్షితంగా బాధితురాలికి అప్పగించారు.
తాను పోగొట్టుకున్న నగదును తక్కువ సమయంలోనే గుర్తించి తిరిగి అందించిన లాలాపేట పోలీసులకు సుమ మాధురి కృతజ్ఞతలు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు సేవలందించిన పోలీసులను పలువురు అభినందించారు.












