బాపట్ల జిల్లా చీరాల మండలంలోని ఈపురుపాలెం మీసేవా కేంద్రం సమీపంలో మంగళవారం ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడిని పుండరీ వెంకటేష్ (25)గా గుర్తించారు.
ఈపురుపాలెంకు చెందిన పుండరీ వెంకటేష్ ఇంట్లోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆయన ఒంగోలు కలెక్టరేట్లో సబార్డినేట్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.
పోలీసులు రంగంలోకి
ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, మృతికి గల కారణాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది.












