బాపట్ల జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయము ఆధ్వర్యంలో చీరాల ఆర్డీవో ఛాంబర్ నందు పిసిపిఎన్ డి టి సబ్ డిస్టిక్ లెవెల్ మల్టీ మెంబర్ అప్ప్రాప్రియేటివ్ అథారిటీ మరియు సబ్ డిస్టిక్ లెవెల్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పిసిపిఎన్ డి టి నిబంధనల అమలుపై సమగ్రంగా చర్చించారు.
సమావేశంలో ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ, ప్రతి స్కానింగ్ సెంటర్ పిసిపిఎన్ డి టి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ చర్యలకు పాల్పడే వారిపై పిసిపిఎన్ డి టి చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.
టీనేజ్ ప్రెగ్నెన్సీ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ అవగాహన కల్పించాలని ఆర్డీవో సూచించారు. ఇందుకోసం ఎన్జీవోలు, వైద్య సిబ్బంది కలిసి పనిచేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు పిసిపిఎన్ డి టి చట్టం గురించి, చిన్న వయసులో గర్భం ధరించడం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించాలని తెలియజేశారు.
ఈ సమావేశంలో కమిటీ సభ్యులు డాక్టర్ సిహెచ్ రత్న మన్మోహన్ (డీఐఓ), డాక్టర్ యాకోబ్, డాక్టర్ సుహాసిని, డాక్టర్ సునీత, డాక్టర్ బ్రహ్మం, సీఐ సుబ్బారావు పాల్గొన్నారు. ఎన్జీవోల ప్రతినిధులు రాజ సువి సాల్మన్, సుభాషిని, డిప్యూటీ డెమో బి మరియమ్మ, డిప్యూటీ హెచ్ఈ మాధవి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.


