బాపట్ల, జూలై 3
చీరాలలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మహిళల భద్రత, శక్తి యాప్ వినియోగం, సైబర్ నేరాల నివారణ, ద్వారా పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలు, డీఎస్పీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.
చీరాలలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో శక్తి టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు మహిళల భద్రత, శక్తి యాప్ వినియోగం, సైబర్ నేరాల నివారణ, ఆపరేషన్ దండాయన్ ద్వారా మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, డీఎస్పీ మొయిన్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో శక్తి టీం ఇన్చార్జి ఎస్సై ఏ. హరిబాబు మాట్లాడుతూ, మహిళలపై వేధింపులు, సైబర్ నేరాలు, మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వేధింపులు ఎదురైతే వెంటనే శక్తి యాప్ ఎస్ఓఎస్ లేదా 112కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ కే. సుబ్బారావు, ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ గారపాటి మంజుల, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.











