బాపట్ల జిల్లా మండలంలో అనుమతులు లేకుండానే పట్టపగలు ఇసుక, మట్టిని వాహనాల్లో తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాన రహదారులపై రవాణా జరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
మండలంలో అనుమతులు లేకుండానే పట్టపగలు ఇసుక, మట్టిని వాహనాల్లో తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాన రహదారులపై రవాణా జరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ రవాణా వెనుక ఎవరి అండదండలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి నష్టం, పర్యావరణంపై ప్రభావం పడకుండా అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ అక్రమ రవాణాను అరికట్టడానికి అధికారులు తక్షణమే స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.












